ఇంటర్ అడ్వాన్స్డ్ ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించిన సిఓఈ విద్యార్ధులు.
– 100శాతం ఉత్తీర్ణత.
– యంపిసిలో 464 , బైపిసిలో 432 మార్కులతో సత్తాచాటిన విద్యార్ధులు.
– ఇంటర్ మొదటి సంవత్సరం అడ్వాన్స్డ్ పరీక్షకు హాజరైన 65మంది లో 20 మంది విద్యార్ధులకు గ్రూప్స్ లో వందశాతం మార్కులు.
పోటో రైటప్: టాప్ మార్కులు సాధించిన విద్యార్ధులను అభినందించిన ప్రిన్సిపాల్ ఐనాల సైదులు.
బెల్లంపల్లి, ఆగస్టు31, (జనంసాక్షి)
బెల్లంపల్లి పట్టణంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్సీ (సిఓఈ) బెల్లంపల్లి విద్యార్ధులు ఇంటర్ అడ్వాస్డ్ సప్లమెంటరీ ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించి తమ సత్తా చాటారు. ఇంటర్ మీడియట్ బోర్డ్ మంగళవారం ప్రకటించిన ఇంటర్ అడ్వాన్స్డ్ ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించడంతో పాటు అందరూ ఉత్తమ ప్రతిభ చూపారు. పరీక్షకు హాజరై ఇంప్రూవ్ మెంట్ వ్రాసిన విద్యార్ధులందరూ గతంలో కంటే ఎక్కువ మార్కులు సాధించారు. అంతేకాకుండా ఇంటర్ మొదటి సంవత్సరం ఇంప్రూవ్ మెంట్ వ్రాసిన 65మంది లో 20 మంది విద్యార్ధులకు గ్రూప్స్ లో వందశాతం మార్కులు పొంది తమకు తిరుగులేదని నిరూపించారు.
యంపిసి విభాగంలో .
470మార్కులకు గాను 464 మార్కులతో బత్తుల కార్తీక టాప్ ర్యాంక్ లో నిలవగా 462 మార్కులతో ఇనగందుల మౌర్య, సిలివేరు వినయ్ లు తరువాత స్థానాల్లో ఉన్నారు.
బైపిసి విభాగంలో .
440మార్కులకు గాను 432 మార్కులతో దుర్గం వెంకటేష్ టాప్ ర్యాంక్ లో నిలవగా 431 మార్కులతో మల్లెపూల సాయితేజ ద్వితీయ స్థానంలోను 428 మార్కులతో బొట్ల రాము, జంగంపల్లి రంజిత్ లు 3వ స్థానాలు సాధించారు.
అత్యుత్తమ ఫలితాలు సాధించి సంక్షేమ గురుకులాల్లో తనదైన ముద్రవేసిన సిఓఈ విద్యార్ధులను బుదవారం ప్రిన్సిపాల్ ఐనాల సైదులు కళాశాలలో పుష్పగుచ్చాలతో అభినందించారు.
ఈకార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ కోట రాజకుమార్, జూనియర్ వైస్ ప్రిన్సిపల్ దాసం అజిత, అధ్యాపకులు నాగినేని శ్రీరామ వర్మ, మిట్ట రమేష్, ఆకినేపల్లి రాజేష్, గాజుల రాజేందర్, చందా లక్ష్మీనారాయణ, కట్ల రవీందర్, అనుముల అనిరుద్, సజ్జనపు విజయ్, అవునూరి రవి తదితరులు ఉన్నారు.