ఇంటింటికి తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు.

ఇంటింటికి తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు.
బూర్గంపహాడ్ మార్చి 21 (జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండలం అంజనాపురం గ్రామంలో ఇంటింటికి తెలుగుదేశం సభ్యత్వ నమోదు కార్యక్రమం మండలం బానోతు నరసింహ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కంచేటి వెంకటేశ్వరావు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల వారికి రాజకీయ రిజర్వేషన్ కల్పించి చట్ట సభల్లో ప్రవేశించడానికి అర్హత తెలుగుదేశం పార్టీ కల్పించిందని, దేశ జనాభాలో సగభాగం ఉన్న మహిళలకు చట్ట సభలలో రిజర్వేషన్ కల్పించి ఆస్తిలో సమాన హక్కులు కల్పించారని, అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టి, పేద ప్రజలకు ప్రజల వద్దకే పరిపాలన సౌలభ్యం పెట్టిన తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవం సభ్యత్వ నమోదు ద్వారా తీసుకురావాలని కోరారు.