ఇందిరాపార్కు వద్ద బీజేపీ నిరసన దీక్ష

హైదరాబాద్‌: తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం డిసెంబర్‌ 9న చేసిన ప్రకటనను అమలు చేయనందుకు నిరసనగా బీజేపీ దీక్ష చేపట్టింది. ఇందిరాపార్కు వద్ద చేపట్టిన దీక్షకు బీజేపీ సీనియర్‌ నేతలు కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ, బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, పలువురు బీజేపీ నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే డిసెంబర్‌ 9న చేసిన ప్రకటనను అమలు చేయాలని వారు డిమాండ్‌ వ్యక్తం చేశారు.