ఇందూరులో ‘ మార్చ్‌’ సన్నాహక కవాతు

నిజామాబాద్‌: సెప్టెంబర్‌ 30న జరిగే తెలంగాణ మార్చ్‌కు సన్నాహక కవాతు ఈ రోజు ఇందూరు నగరంలో జరిగింది. నెహ్రూెపార్క్‌లోని తెలంగాణ అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించి అమరవీరుల ఆశయాలు సాధిస్తామని ప్రతిజ్ఞ చేశారు. అనంతరం ప్రారంభమైన కవాతు తెలంగాణ చౌక్‌కు చేరుకుంది, అక్కడ జరిగిన బహిరంగసభలో జేఏసీ చైర్మన్‌ కోదండరాం తదితర నాయకులు  ప్రసంగించారు. ప్రభుత్వం ఎన్ని నిర్భందాలు విధించినా మార్చ్‌ను విజయవంతం చేస్తామని జిల్లా జేఏసీ నేతలు తెలియజేశారు.