ఇంద్రకీలాద్రి పరిసరాల్లో ట్రాఫిక్‌ మళ్లింపు

విజయవాడ: దసరా శరన్నవరాత్రి మహోత్సవాలకు వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుండా ఇంద్రకీలాద్రి పరిసరాల్లో ట్రాఫిక్‌ను ఆంక్షలు విధించారు. ఇంద్రకీలాద్రి పక్కన జాతీయ రహదారిపై ట్రాఫిక్‌ను మళ్లించారు. హైదరాబాద్‌ నుంచి కోల్‌కతా వేళ్లే వాహనాలను సూర్యపేట, ఖమ్మం, అశ్వారావుపేటల మీదుగా మళ్లిస్తున్నారు. హైదరాబాద్‌ నుంచి విజయవాడకు వచ్చే భారీ వాహనాలను ఇబ్రహీంపట్నం రింగ్‌ నుంచి మైలవరం, నూజివీడు,హనుమాన్‌జంక్షన్‌, గన్నవరం మీదుగా మళ్లిస్తారు. హైదరాబాద్‌ నుంచి వచ్చే అర్టీసీ బస్సులు గొల్లపూడి బైపాస్‌, సితార జంక్షన్‌, పాలప్రాజెక్ట్‌, చిట్టినగర్‌, లోబ్రిడ్జి, పోలీస్‌ కంట్రోల్‌రూం మీదుగా బస్టాండులోకి అనుమతిస్తారు.