ఇక టాంపర్‌ ప్రూఫ్‌ పట్టాదారు పాసు పుస్తకాలు

హైదరాబాద్‌: టాంపర్‌ ప్రూఫ్‌ పట్టాదారు పాసుపుస్తకాలను 3 జిల్లాల్లో అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముందుగా ప్రకాశం, అనంతపురం, వరంగల్‌ జిల్లాల్లో అమలుచేయాల్సిందిగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పాసు పుస్తకాలను సాధారణ రైతులకు రూ. వందకు ఎస్సీ, ఎస్టీ రైతులకు రూ. 75కు అందజేయాని ప్రభుత్వం ఉత్తర్వులు పేర్కొంటున్నాయి.