ఇది అంతంకాదు, ఆరంభమే: కోదండరాం

హైదరాబాద్‌: ఈనెల 30న నిర్వహించ తలపెట్టిన తెలంగాణ మార్చ్‌ ర్యాలీ సందర్భంగా ఇవాళ జేఏసీ ఆధ్వర్యంలో సన్నాహక ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ సందర్భంగా జేఏసీ ఛైర్మన్‌  కోదండరాం మీడియాతో మాట్లాడారు. ఇది అంతకరంకాదు. ఆరంభం మాత్రమే నని ఆయన వ్యాఖ్యానించారు. సెన్టెంబర్‌ 30న ‘ తెలంగాణ మార్చ్‌’ను చాలా భారీగా నిర్వహిస్తామని ఆయన దీమాగా చెప్పారు. ఉద్యమాన్ని శాంతి భద్రతల సమస్యగా చోడొద్దని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. కేంద్ర ప్రభుత్వం సామరస్యంగా తెలంగాణను ప్రకటించాలి, లేదంటే  ఉద్యమం తప్పదని  ఆయన హెచ్చరించారు. కాగా, మాణికేశ్వరీనగర్‌ నుంచి సికింద్రాబాద్‌ వరకు ఇవాళ బయలుదేరిన తెలంగాణ మార్చ్‌ సన్నాహక ర్యాలీ కారణంగా ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌ వద్ద భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది.