ఇద్దరు వ్యక్తులను గొంతుకోసి చంపిన దుండగులు

హైదరాబాద్‌: మహబూబ్‌నగర్‌ జిల్లా షాద్‌నగర్‌ శివారులో జంట హత్యలు సంచలనం కలిగించాయి. ఇద్దరు వ్యక్తులను దుండగులు గొంతుకోసి చంపారు. మృతులను అనంతపురం జిల్లాకు చెందినవారిగా గుర్తించారు. పాత కక్షలే ఇందుకు కారణమని భావిస్తున్నారు. బుక్కపట్నం మండలానికి చెందిన కృష్ణాపురంవాసి మల్లికార్జున, తాడిపత్రికి చెందిన లింగుట్ల ప్రసాద్‌లుగా వారిని గుర్తించారు.