ఇసుక అక్రమాలపై విచారణ వాయిదా:సుప్రీంకోర్టు

ఢిల్లీ: రాష్ట్రంలో రోజు రోజుకు పెరిగి పోతున్న అక్రమ ఇసుక రవాణ, అక్రమ తవ్వకాలపై సుప్రీంకోర్టులో దాఖలైన కేసు విచారణ మరో మూడు వారాలకు వాయిదా పడింది. రాష్ట్రంలోని ఇసుక రావాణ తవ్వకాలపై వివరణ ఇవ్వాలని సుప్రీం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇసుక అక్రమ రవాణ, తవ్వాకాలు వీటికి సంబంధించిన నిబంధనల రూపకల్పన ప్రక్రియ కొనసాగుతుందని రాష్ట్ర ప్రభుత్వం తెలుపుతున్నట్లు సమాచారం.