ఈజిప్టులో కొనసాగుతున్న ఆందోళనలు

కైరో: ఈజిప్టులో అధ్యక్షుడికి వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. కైరోలోని అధ్యక్షుని భవరం వద్ద భారీ సంఖ్యలో చేరుకున్న ఆందోళనకారులు భద్రతా సిబ్బంది ఏర్పాటు చేసిన బారికేడ్లను తొలగించి నిరసనకు దిగారు. మరోవైపు ఆందోళనకారుల నిరసనలతో అధ్యుక్షుడు మోర్సీ దిగివచ్చారు. ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని వాయిదా వేశారు. అయితే ఈ కార్యక్రమాన్ని పూర్తిగా రద్దు చేయాలని నిరసనకారులు డిమాండ్‌ వ్యక్తం చేశారు.