ఈజిప్డు మాజీ అధ్యక్షుడు ముబారక్‌ ఆరోగ్య పరిస్థితి విషమం

కైరో : ఈజిప్టు మాజీ అధ్యక్షుడు హోస్నీ ముబారక్‌ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. జీవిత ఖైదు అనుభవిస్తున్న ముబారక్‌ ఆస్పత్రిలో చేర్పించిన వారం రోజుల తర్వాత ఆయన కోమాలోకి వెళ్లినట్లు సమాచారం. ముబాకర్‌ మరణించినట్లుగా వదంతులు వ్యాపించడంతో ఆదివారం ఉదయం ఆయన బార్య సుజన్నే ముబారక్‌, ఇద్దరు కోడళ్లు ముబారక్‌ను చూసేందుకు ఆస్పత్రికి వచ్చినట్లుగా అనధికార వర్గాలు తెలిపాయి. ముబారక్‌ ద్రవ పదార్థాలు, పెరుగు మాత్రమే తీసుకుంటున్నట్లు ఆ వర్గాలు తెలిపాయి.