ఈడీ పిటిషన్‌పై విచారణ 25కు వాయిదా

హైదరాబాద్‌: అక్రమాస్తుల కేసులో జగన్‌ను విచారించాలన్న ఈడీ పిటిషన్‌పై విచారణను కోర్టు ఈ నెల 25కు వాయిదా వేసింది. మరోవైపు ఈడీ పిటిషన్‌పై నోటిసులు తీసుకునేందుకు జగన్‌ తరపు న్యాయవాదులు నిరాకరించారు. నోటిసులు నేరుగా జగన్‌కు ఇచ్చేందుకు ఈడీ అధికారులు చంచల్‌గూడ్‌ జైలుకు  వెళ్లారు.