ఈనెల 11 నుంచి బెల్లంపల్లి- హైదరాబాద్‌ ఇంటర్‌సిటీ

బెల్లంపల్లి: బెల్లంపల్లి నుంచి హైదరాబాద్‌కు కొత్తగా నడవనున్న ఇంటర్‌ సిటీ ఎక్స్‌ప్రెస్‌ను ఈ నెల 11వ తేదీనుంచి ప్రారంభిస్తారని పెద్దపల్లి ఎంపీ వివేకానంద తెలియజేశారు.  రైలు హైదరాబాద్‌లో ఉదయం 5.15 గంటలకు బయల్దేరి పది గంటలకు బెల్లంపల్లి  చేరుకుంటుంది. తిరిగి అక్కడ్నుంచీ పదిన్నరకు బయల్దేరి 3.45 గంటలకు హైదరాబాద్‌కు చేరుకుంటుందని ఆయన  తెలియజేశారు.