ఈనెల 16 తర్వాతే శాసనసభ శీతాకాల సమావేశాలు
హైదరాబాద్: ఈ నెల పదో తేదీ నుంచి తల పెట్టిన శాసనసభ శీతాకాల సమావేశాలు జరగడం లేదు. దళిత, గిరిజన ఉపప్రణాళిక చట్టబద్ధత కోసం మూడు రోజుల పాటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించిన ప్రభుత్వం పదో తేదీ నుంచి మళ్లీ సమావేశాలు ఉంటాయని బీఏసీ సమావేశంలో తెలిపింది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో పదో తేది నుంచి అసెంబ్లీని సమావేశపరిచే పరిస్థతి కనబడడం లేదు. ఇప్పటికే శాసనసభను సభాపతి నిరవధికంగా వాయిదా వేశారు. తిరిగి సమావేశపరచాలంటే మళ్లీ నోటిఫికేషన్ జారీ చేయాల్సి ఉంటుంది పదో తేదీనుంచి శాసనసభ సమావేశాలు లేవని ఒకవేళ ఉంటే ఈ నెల 16వ తేదీన తలపెట్టిన కాంగ్రెస్ రాష్ట్ర స్థాయి సదస్సు అనంతరం ఉంటాయని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు.