ఈనెల 21న జరిగే కల్లుగీత కార్మిక సంఘం మండల సభను జయప్రదం చేయండి

 

దంతాలపల్లి సెప్టెంబర్ 7 జనం సాక్షి

ఈనెల 21వ తేదీన మండల కేంద్రంలో నిర్వహించే కల్లుగీత కార్మిక సంఘం మండల మహాసభను జయప్రదం చేయాలని రాష్ట్ర సంఘం ప్రధాన కార్యదర్శి ఎంవి రమణ, జిల్లా అధ్యక్షుడు యామగాని వెంకన్న లు పిలుపునిచ్చారు. బుధవారం మండల కేంద్రంలో మండల సంఘం అధ్యక్షులు గండి వెంకటనారాయణ గౌడ్ అధ్యక్ష ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ… మండలంలోని గౌడ కులస్తుల సమస్యలు తదితర అంశాలపై భవిష్యత్ కార్యాచరణ చర్చించుటకు గౌడ కులస్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల సంఘం గౌరవ అధ్యక్షులు గుండగాని లింగన్న, సలహాదారు కొత్త అంతయ్య,ప్రధాన కార్యదర్శి తండ చిన్న రాములు, ఉపాధ్యక్షులు చీకటి ఉప్పలయ్య,ముత్తు, కారుపోతుల సోమయ్య, కందునూరి యాదగిరి, వెంకన్న తదితరులు పాల్గొన్నారు