ఈ ఆర్థిక సంవత్సరంలోనే రాయితీ సిలిండర్ల పెంపు: పనబాక

గుంటూరు : ఈ ఆర్థిక సంవత్సరంలోనే రాయితీ సిలిండర్లను 6 నుంచి 9కి పెంచుతామని కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి వెల్లడించారు. రాజీవ్‌గాంధీ ఎల్‌పీజీ వితరక్‌ యోజన కింద గ్రామీణప్రాంతాల్లో 2015 నాటికి ఐదున్నర కోట్ల కనెక్షన్లను జారీ చేస్తామని గుంటూరులో ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన కేంద్ర మంత్రి తెలియజేశారు.  మండలం కేంద్రాలు, గ్రామాల్లోనూ గ్యాస్‌ ఏజెన్సీలను ఏర్పాటు చేస్తామన్నారు. ఎంఐఎం ఎమ్మెల్యే అక్మరుద్దీన్‌ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు మంత్రి చెప్పారు.