ఈ సేవ కేంద్రల్లో టెట్‌ ఓఎంఆర్‌ కాపీలు

హైదరాబాద్‌ : టెట్‌ పరీక్ష రాసిన అభ్యర్థుల ఓఎంఆర్‌ కాపీలను అన్ని ఈ సేవ కేంద్రల్లో అందుబాటులో ఉంచినట్లు విద్యాశాఖ అధికారులు తెలియజేశారు. వీటిని అభ్యర్థులు రూ. 20 రుసుము చెల్లించి మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి పొందవచ్చని తెలిపారు.