ఉగ్రవాదాన్ని యువతే సమర్థంగా ఎదుర్కొనగలదు : బొత్స సత్యనారాయణ
హైదరాబాద్: దిల్‌సుఖ్‌నగర్ బాంబు పేలుళ్ల ఘటనపై నగరవాసులంతా ఒక్కటైనిలిచి సమర్థంగా ఎదుర్కొన్నారని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా హైదరాబాద్ గాంధీభవన్‌లో చేపట్టిన దీక్షను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా బొత్స మాట్లాడుతూ ఉగ్రవాదాన్ని యువతే సమర్థంగా ఎదుర్కొనగలదని అన్నారు. బాంబు పేలుళ్ల ఘటన జరిగిన వెంటనే యువజన కాంగ్రెస్ స్పందించి రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి తన వంతు కృషి చేసిందని, ఇప్పుడు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దీక్ష చేపట్టడం అభినందనీయమన్నారు. భవిష్యత్తులో ప్రజలను చైతన్యవంత చేసే మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని యువజన కాంగ్రెస్ నాయకులకు సూచించారు.