ఉజ్జయిని అమ్మవారిని దర్శించుకున్న కిరణ్‌కుమార్‌ రెడ్డి

సికింద్రాబాద్‌: లష్కర్‌ బోనాల సందర్భంగా ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ ఉదయం దర్శించుకున్నారు. సీఎంకు ఆలయ నార్వాహకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో సీఎం పూజలు నిర్వహించారు. సీఎం రాక సందర్భంగా పోలీసులు ఆలయ పరిసరాల్లో కట్టుదిట్టమైన బందోబస్తు చేపట్టారు.