ఉత్తమ సేవలతోనే ఉద్యోగులకు గుర్తింపు
హుజూర్ నగర్ మార్చి 6 (జనంసాక్షి): ఉత్తమ సేవలు అందించడం ద్వారానే ఉద్యోగులకు సమాజంలో మంచి గుర్తింపు వస్తుందని హుజూర్ నగర్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కస్తాల శ్రావణ్ కుమార్ అన్నారు.
గత నాలుగు రోజులుగా హుజూర్ నగర్ 11వ వార్డులో నిర్వహించిన కంటి వెలుగు శిబిరం ముగింపు సందర్భంగా సోమవారం కంటి వెలుగు సిబ్బందిని సన్మానించి మాట్లాడుతూ కంటి వెలుగు ద్వారా అన్ని వర్గాలకు మేలు కలుగుతుందని 11వ వార్డు లో 494 మంది శిబిరానికి వచ్చి పరీక్షలు చేయించుకోగా వారిలో 134 మందికి దృష్టి లోపం గల వారికి కళ్ళజోళ్ళు అందించడంతో పాటు107మందిని ఆపరేషన్ కొరకు రిఫర్ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో క్యాంపు సూపర్వైజర్ ఇందిరాల రామకృష్ణ, డాక్టర్ సుష్మ, మల్లిక, శివ, కృష్ణ, హైమావతి, కాంగ్రెస్ నాయకులు సామల శివారెడ్డి, దొంగరి వెంకటేశ్వర్లు, తన్నీరు మల్లికార్జున్, కస్తాల సైదులు, కస్తాల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.