ఉత్తర కాశిలో భారీ వర్షాలు: 10 మంది మృతి

డెహ్రాడూన్‌: ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తర కాశిలో ఈరోజు కురిసిన భారీ వర్షాల కారణంగా ఆకస్మిక వరదలు సంభవించాయి. దీంతో ఏమిజరిగిందో తెలుసుకునేలోగా చాలా మంది వరద ఉదృతిలో కొట్టుకుపోయారు. ఈ వరదల  దాటికి పది  మంది మృతి చెందగా మరో 38 మంది జాడ తెలియడం లేదు. చార్‌దామ్‌ సందర్శనకు వెళ్లిన వందల మంది యాత్రికుల జాడ తెలియడం లేదని అధికారులు తెలియజేశారు. వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.