ఉదయం జరిగిన రోడ్డు ప్రమాద భాధితులకు తక్షణ సహయం అందించాలని సీఎం ఆదేశం

హైదరాబాద్‌: రాష్ట్రంలో రెండు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో బాధితలకు తక్షణ సహాయం అందించాలని సీఎం కిరణ్‌కుమార్‌ రెడ్డి ఆయా జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. తూర్పుగోదావరి జిల్లా తాళ్లరేవు మండలం చొల్లంగివద్ద, గుంటూరు జిల్లా రాజుపాలెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదాల్లో క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని సూచించారు. మృతులకుటుంబాలకు సానుభూతి తెలిపారు.