ఉన్నత చదువులకు అయ్యే ఖర్చులు ప్రభుత్వమే పూర్తిగా చెల్లించాలి-ఈటెల

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ ప్రభుత్వం పేద విద్యార్థులకు చదువులను దూరం చేసే దుర్మార్గపు ఆలోచన చేస్తోందని తెరాస శాసనసభాపక్ష నేత ఈటెల రాజేందర్‌ అన్నారు.ఫీజు రీఇంబర్స్‌మెంట్‌కు పరిమితులు విధించి బీసీలకు అన్యాయం చేస్తోందన్నారు. పేద విద్యార్థులందరికీ ఉన్నత చదువులకు అయ్యే ఖర్చులు ప్రభుత్వమే పూర్తిగా చెల్లించాలని లేకపోతే తెరాస ఆద్వర్యంలో ఆందోళన చేపడతామన్నారు.