ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే వర్ధంతి వేడుకలు.
రాజన్న సిరిసిల్ల బ్యూరో. మార్చ్ 10. (జనంసాక్షి) ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే వర్ధంతి వేడుకలను కుసుమరామయ్య బాలుర ఉన్నత పాఠశాలలో శుక్రవారం నిర్వహించారు. సావిత్రిబాయి పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం ఉపాధ్యాయ సంఘాల నాయకులు మాట్లాడుతూ దేశంలో తొలి మహిళ ఉపాధ్యాయురాలిగా అట్టడుగు వర్గాల్లో విద్య వ్యాప్తి కోసం ఆమె చేసిన కృషిని కొనియాడారు. ఆమె అందించిన స్ఫూర్తిని కొనసాగించాల్సిన అవసరం ఉందని తెలిపారు. కార్యక్రమంలో పాతూరి మహేందర్ రెడ్డి, పాకాల శంకర్ గౌడ్, కుమ్మరి మల్లేశం, దేవత ప్రభాకర్, పురుషోత్తం పాల్గొన్నారు.