ఉప ఎన్నికల కారణంగా ఖజానాపై భారం

గుంటూర్‌ : ఉప ఎన్నికలు తరచు జరుగుతుండటంతో ఖజానాపై భారం పడుతోందని ఎంపీ రాయపాటి సాంబశివరావు పార్లమెంటరీ నైతిక ప్రవర్తనీ నియమావళి కమిటీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. అకారణంగా రాజీనామ చేసే ఎమ్మెల్యేలు, ఎంపీలు రెండు పర్యాయాలు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించాలని కోరుతూ తన లేఖలో కోరారు. ఉప ఎన్నికల కారణంగా ఖజానాపై అదనపు భారం పడటమే కాక ఆయా నియోజకవర్గాల్లో అభివృధ్ది నిలిచిపోతుందని ఆయన తన లేఖలో పేర్కొన్నారు.