ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో అన్సారీకే తృణమూల్‌ మద్దతు

కోల్‌కతా: ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో యూపీఏ అభ్యర్థి హమీద్‌ అన్సారీకే తృణమూల్‌ కాంగ్రెస్‌ మద్దతివ్వడానికి నిర్ణయించింది. గతంలో రాష్ట్రపతి ఎన్నికల సందర్భంలోనూ తృణమూల్‌ యూపీఏ అభ్యర్థి అయిన ప్రణబ్‌ ముఖర్జీకి మద్దతిచ్చిన విషయం తెలిసిందే.