ఉస్మానియా లో మైనింగ్ ఇంజనీరింగ్ నిర్వహణకు కోల్ ఇండియా భారీ వితరణ.
ఉస్మానియా లో మైనింగ్ ఇంజనీరింగ్ నిర్వహణకు కోల్ ఇండియా భారీ వితరణ…….బోధకుల జీతాల కోసం రూ.3 కోట్లు డిపాజిట్……….ఎం ఓ యు పై సంతకాలు చేసిన కోలిండియా చైర్మన్ ప్రమోద్ మహాజన్ ఉస్మానియా వైస్ ఛాన్సలర్ డి రవీందర్……
పూర్వ విద్యార్థుల గట్టి పట్టుదల తో ఉంటే ప్రతి విద్యాలయానికి వెలుగులే….కోలిండియా చైర్మన్ అండ్ ఎండి. ప్రమోద్ మహాజన్…….
ఉస్మానియా యూనివర్సిటీ లో తిరిగి మైనింగ్ ఇంజనీరింగ్ విభాగం పునరుద్ధరణ తో బీటెక్,ఎంటెక్ కోర్సుల ప్రారంభానికి ఆ విభాగం పూర్వ విద్యార్థుల చొరవతో కోల్ ఇండియా సంస్థ భారీ సహకారానికి ముందుకు వచ్చింది.
బోధకుల జీతభత్యాలు,తదితరుల ఖర్చులు చెల్లించడానికి చైర్ -ఏ ప్రొఫెసర్ కార్యక్రమంలో భాగంగా మూడు కోట్ల రూపాయల డిపాజిట్ ను అందించింది. ఈ మేరకు సోమవారం(27న) నాడు యూనివర్సిటీలో జరిగిన ఒక కార్యక్రమంలో ఒప్పంద పత్రాలపై కొలిండియా చైర్మన్ &ఎండి ప్రమోద్ మహాజన్ ,ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సులర్ ప్రొఫెసర్ డి రవీందర్ సంతకాలు చేశారు . కార్యక్రమంలో విశిష్ట అతిథిగా ఉస్మానియా మాజీ విద్యార్థి ,ప్రస్తుత కోలిండియా డైరెక్టర్ టెక్నికల్ బి.వీరారెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కోల్ ఇండియా చైర్మన్ ప్రమోద్ మహాజన్ మాట్లాడుతూ పూర్వ విద్యార్థులు తాము చదివిన కళాశాల పట్ల అభిమానంతో తీసుకున్న ప్రత్యేక చొరవ వల్లనే నేడు ఉస్మానియాలో మైనింగ్ ఇంజనీరింగ్ విభాగం తిరిగి ప్రారంభం అవుతోందని, ఇంత గొప్ప కార్యక్రమానికి చొరవ చూపిన పూర్వ విద్యార్థులను తాను ప్రత్యేకించి అభినందిస్తున్నట్లు పేర్కొన్నారు. కళాశాలపూర్వ విద్యార్థి ,ప్రస్తుత కోల్ ఇండియా డైరెక్టర్ టెక్నికల్ బి వీరారెడ్డి మాట్లాడుతూ ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఉస్మానియా యూనివర్సిటీలో 1978 వరకు మైనింగ్ ఇంజనీరింగ్ విభాగం ఉండేదని, ఆ విభాగంలో చదువుకున్న తనలాంటి అనేకమంది దేశంలోని పలు మైనింగ్ సంస్థలకు చైర్మన్ లు గా డైరెక్టర్ లుసేవలు అందిస్తున్నారని, ఒక మాజీ విద్యార్థిగా తను చదివిన కళాశాల అభివృద్ధికి తోడ్పడటం ఎంతో ఆనందంగా ఉందన్నారు. వైస్ ఛాన్స్ లర్ ప్రొఫెసర్ డి. రవీందర్ మాట్లాడుతూ రాష్ట్ర రాజధాని చుట్టూ అనేక మైనింగ్ పరిశ్రమలు ఉన్నాయని, దేదానికి అవసరమైన మైనింగ్ కార్యకలాపాలకు యువమైనింగ్ విద్యార్థుల అవసరం నేడు ఎంతో ఉందని ,దీనిని దృష్టిలో ఉంచుకొని ఉస్మానియాలో తిరిగి ప్రారంభించిన మైనింగ్ విభాగానికి కోల్ ఇండియా వంటి సంస్థలు సహకరించడం ఎంతో సంతోషంగా ఉందని ధన్యవాదాలు తెలిపారు .ఉస్మానియా యూనివర్సిటీ లో తిరిగి మైనింగ్ విభాగం పునరుద్ధరణకు ప్రత్యేక చొరవ చూపిన పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షులు ,మాజీ సింగరేణి డైరెక్టర్లు అయిన బి రమేష్ కుమార్ జనరల్ సెక్రెటరీ, మాజీ సింగరేణి జిఎం ఎం ఎం .ఎస్ . వెంకటరామయ్య , పి గోపాల్ రావు, కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ మాజీ డైరెక్టర్ డి ఎన్ ప్రసాద్, మాజీ సింగరేణి జిఎం ఎం .ఎస్ . వెంకటరామయ్య తదితరులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఇంకా పూర్వ విద్యార్థి సంఘ నాయకులు అమర్నాథ్, డి ఆర్ వి సుశీల్ కుమార్ ,బి మహేష్ తదితరులు పాల్గొన్నారు . డాక్టర్ ఎమ్మెస్ వెంకట్రామయ్య వందన సమర్పణ చేశారు..