ఉస్మానియా విశ్వవిద్యాలయం లో విద్యార్థుల ఆందోళన
హైదరాబాద్: ఓయూలో డిటెన్షన్ విధానాన్ని తొలగించాలని హైదరాబాద్ లోని పలు ఇంజినీరింగ్ కళాశాలల విద్యార్థులు ఆందోళన నిర్వహించారు. బుధవారం స్థానిక విశ్వవిద్యాలయ పరిపాలన భవనం ఎదుట ఓయూ ఐకాస ఆధ్వర్యంలో ఆందోళనకు దిగిన విద్యార్థులు వీసీకు వినతిపత్రం సమర్పించారు. అనంతరం ఎస్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు రాజీవ్‌రతన్ వీసీని కలిసేందుకు ప్రయత్నించడంతో ఓయూ ఐకాస నేతలు అడ్డుకున్నారు. ఆంధ్రా ప్రాంతానికి చెందిన రాజీవ్ ఓయూ వ్యవహారాల్లో తలదూర్చడానికి అనుమతించబోమన్నారు. అనంతరం రాజీవ్ విద్యార్థులు ఆందోళన విరమించారు.