ఊరుగొండలో ఓటర్లలపై పోలీసుల లాఠీచార్జి

పరకాల, జూన్‌ 11 : పరకాల నియోజకవర్గ పరిధిలోని ఆత్మకూరు మండలం ఊరుగొండ పోలింగ్‌ కేంద్రంలో ఓటేసి వెళుతున్న ఓటర్లపై పోలీసులు అకారంగా లాఠీలు ఝుళిపించారు. దీంతో పలువురు గాయపడ్డారు. ఈ సందర్భంగా పోలీసులకు, ఓటర్లకు మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. ఓటేయడానికి వచ్చిన తమపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీలతో కొట్టడమేమిటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. పోలీసుల వైఖరిని నిరసిస్తూ ఊరుగొండ గ్రామస్తులు పోలింగ్‌ కేంద్రం వద్ద ఆందోళన చేపట్టారు.