ఎంబీబీఎస్‌ సీట్ల సమస్య పరిష్కారానికి ప్రత్యేక బెంచ్‌: హైకోర్టు

హైదరాబాద్‌: ప్రేవేటు వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్‌ సీట్లకు సంబందించి దాఖలైన అన్ని పిటీషన్ల పరిష్కారానికి ప్రత్యేక బెంచ్‌ ఏర్పాటు చేసినట్లు హైకోర్టు స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ బెంచ్‌ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించింది. రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు వైద్య కళాశాలల్లో యాజమాన్య కోటా సీట్లను రూ.15లక్షల నుంచి రూ. 50లక్షల వరకు విక్రయిస్తున్నారని దీని వల్ల ప్రతిభ గల విద్యార్థులు నష్టపోతున్నారని సేవ్‌ మెరిట్‌ సొసైటీ అనే స్వచ్ఛంద సంస్థ హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దాఖలు చేసింది. అంతే కాకుండా గతంలో హైకోర్టు జారీ చేసిన మార్గదర్శకాల పట్ల ఆయా కళాశాలలు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాయని ప్రతిభ ఆధారంగా (సీ) కేటగిరి సీట్లు భర్తీ చేయడం లేదని పలు పిటీషన్లు దాఖలయ్యాయి. వీటన్నింటిని విచారణకు స్వీకరించిన హైకోర్టు ధర్మాసనం ఈనెల 10న సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాల మేరకు మెడికల్‌ సీట్లపై దాఖలైన పిటీషన్ల పరిష్కారానికి ప్రత్యేక బెంచ్‌ ఏర్పాటు చేస్తున్నట్లు స్పష్టం చేసింది