ఎన్జీరంగా విశ్వవిద్యాలయానికి తెలంగాణవారిని వీసీగా నియమించాలి: కోదండరాం

హైదరాబాద్‌: ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీగా తెలంగాణ ప్రాంత శాస్త్రవేత్తనే నియమించాని తెలంగాణ రాజకీయ ఐకాస ఛైర్మన్‌ ప్రొ.కోదండరాం డిమాండ్‌ వ్యక్తం చేశారు. బషీర్‌బాగ్‌లో జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం ద్వారానే ఈ ప్రాంత రైతాంగానికి, ప్రజలకు న్యాయం జరుగుతుంతన్నారు.