ఎన్‌ఎంయూతో ఆర్టీసీ చర్చలు విఫలం

హైదరాబాద్‌: సమ్మె నోటీసు ఇచ్చిన ఎన్‌ఎంయూతో బస్‌భవన్‌లో ఆర్టీసీ యాజమాన్యం జరిపిన చర్చలు విఫలమయ్యాయి. తమ డిమాండ్లపై యాజమాన్యం నుంచి ఎటువంటి హామీ రాలేదని ఎన్‌ఎంయూ నేత మహమూద్‌ తెలిపారు. ఒప్పంద కార్మికుల సర్సీఉ క్రమబద్దీకరణ, వేతన సవరణ కమిటీ, కారుణ్య నియామకాలు చేపట్టాలని తాము డిమాండ్‌ చేస్తున్నామన్నారు. ఈనెల 11న మరోమారు ఆర్టీసీ యాజమాన్యంతో చర్చలు జరుపనున్నట్లు తెలిపారు. గడువులోగా సమస్యలు పరిష్కరించకపోతే ఈనెల 14నుంచి రాష్ట్రవ్యాప్త సమ్మె చేపట్టనున్నట్లు ఎన్‌ఎంయూ తెలిపింది.