ఎన్‌ఎంయూతో చర్చిస్తున్న ఆర్టీసీ యాజమాన్యం

హైదరాబాద్‌: సమ్మె నోటిసు ఇచ్చిన నేషనల్‌ మజ్దూర్‌ యూనియన్‌(ఎన్‌ఎంయూ)తో ఆర్టీసీ యాజమాన్యం నాలుగో దఫా చర్చలు జరుపుతోంది. రెండు వేల మంది కాంట్రాక్టు కార్మికులను క్రమబద్దీకరిస్తామని ఆర్టీసీ యాజమాన్యం హామీ ఇచ్చిందని ఎన్‌ఎంయూ నేతలు తెలిపిన విషయం తెలిసిందే. ఇవాళ మిగతా డిమాండ్లపై, మరింత మంది కార్మికుల క్రమబద్దీకరణ గురించి చర్చిస్తున్నట్లు సమాచారం.