ఎపీపీఎస్పీపై సీఎం సమీక్ష

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌పై కమిటీ చేసిన సిఫార్సులపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. కమిషన్‌ నిర్వహించే మర్ని ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలు నిర్వహించాలని, గ్రూప్‌-1, గ్రూప్‌ -1(బి)లకు ఒకే పరీక్ష నిర్వహించాలని సంస్కరణల కమిటీ సిఫార్సులు చేసింది. కమిటీ చేసిన సిఫార్సులపై సాధ్యమైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ముఖ్యమంత్రి ఆదేశించారు.