ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి పై ఎంపీపీ అసత్య ప్రచారాలు మానుకోవాలి

share on facebook

హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి పై ఎంపీపీ గూడెపు శ్రీనివాస్ అసత్య ప్రచారాలు మానుకోవాలని రజక సంఘం రాష్ట్ర నాయకుడు చిలక రాజు అజయ్ కుమార్ అన్నారు.  గురువారం ఈ సందర్భంగా  ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో  మాట్లాడుతూ ఎంపీపీ గూడెపు  శ్రీనివాస్ స్థలం వివాదంపై ఎమ్మెల్యే సైదిరెడ్డి పై ఆరోపణలు చేయడాన్ని ఖండించారు. స్థల వివాదం ఎంపీపీ గూడెపు శీనువాస్ వ్యక్తిగతమన్నారు. వివాదం   మున్సిపల్ అధికారులకు, ఎంపీపీ కి మధ్య జరిగితే ఎమ్మెల్యే కి ఏం సంబంధం అని ప్రశ్నించారు. ఎంపీపీ కులాన్ని అడ్డు పెట్టుకోవడం సరికాదన్నారు. రజకులు ఎప్పుడు వివాదాల జోలికి పోలేదన్నారు. ఎమ్మెల్యే కులాల పాతిపదికన రాజకీయం చేయలేదన్నారు. బీసీలను రాష్ట్ర ప్రభుత్వం, ఎమ్మెల్యే సైదిరెడ్డి ఎప్పుడు గౌరవిస్తూ అభివృద్ధికి తోడ్పడ్డారన్నారు. ఈ గోబెల్స్ ప్రచారం మానుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రజక సంఘం అధ్యక్షులు ఎల్లుట్ల వీరయ్య, జిల్లా రజక సంఘం నాయకులు చిలక రాజు లింగయ్య, కోమటికుంట సర్పంచ్ పెద్దారపు లక్ష్మీనారాయణ, కోమరాజు నరేష్, సోమరాజు వెంకట్, దుగ్గి నరసింహారావు, తదితరులు పాల్గొన్నారు.

Other News

Comments are closed.