ఎయిర్ పోర్టులో ముమ్మరంగా తనిఖీలు
హైదరాబాద్: స్వాతంత్రదినోత్సవం నేపధ్యంలో శంషాబాద్ విమానాశ్రయంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఉగ్రవాదులు విమానాల హైజాక్‌కు పాల్పడే అవకాశం ఉందన్న ఐబీ హెచ్చరికల నేపధ్యంలో సీఐఎన్‌ఎఫ్ బలగాలు అప్రమత్తమయ్యాయి. తనిఖీలను ముమ్మరం చేశారు.సందర్శకుల పాసులను నిలిపివేశారు. సీఐఎన్‌ఎఫ్ బలగాలు మాక్‌డ్రిల్ నిర్వహించారు.