ఎర్రన్నాయుడి మృతికి భాజపా దిగ్భ్రాంతి

హైదరాబాద్‌: తెదేపా నేత ఎర్రన్నాయుడు మృతి పట్ల భాజపా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తిం చేసింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్‌రెడ్డి ఎర్రన్నాయుడు కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఎర్రన్నాయుడు అకాలమరణం తెదేపాకు తీరని లోటని ఆ పార్టీ నేత సీహెచ్‌ విద్యాసాగర్‌రావు అన్నారు. లోక్‌ సభ సభ్యునిగా, కేంద్రమంత్రిగా ఆయన చేసిన సేవలను కొనియాడారు.