ఎర్రన్నాయుడు మృతిపై హెచ్చార్సీలో ఫిర్యాదు

హైదరాబాద్‌: ఎర్రన్నాయుడి మృతికి వైద్యాధికారుల నిర్లక్షమే కారణమని మానవ హక్కుల సంఘంలో ఫిర్యాదు చేశారు. సమయానికి ప్రాణవాయివు అందించకపోవటం వల్లే ఎర్రన్నాయుడు మృతి చెందాడరని  ఆరోపిస్తూ జాతీయ మానవహక్కుల కార్యకర్త ధనగోపాల్‌ ఈ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై ఈ నెల 12లోగా వివరణ ఇవ్వాలని శ్రీకాకుళం డీఎంహెచ్‌ఓను హెచ్చార్సీ ఆదేశించింది. ఎర్రన్నాయుడు మృతికి 108, నేషనల్‌ హైవే అథారిటీ పరోక్ష కారణమని ఫిటిషన్‌లో ధనగోపాల్‌ పేర్కోన్నారు.