ఎల్ వో సి మంజూరు చేయించిన జడ్పీ చైర్మన్

 జనం సాక్షి , మంథని : పెద్దపల్లి జిల్లా మంథని మండలం బెస్తపల్లి గ్రామానికి చెందిన మండి శ్రీలత అనారోగ్యంతో నిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ సహాయం కొరకు మంథని నియోజకవర్గ బీఆర్ ఎస్ పార్టీ ఇంఛార్జి పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్ కు తెలుపగా వారు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా వైద్య ఖర్చుల నిమిత్తo రూ.2,50,000 ఎల్ వో సి మంజూరు చేయించారు. ఈ ఎల్ ఓ సి మంజూరు పత్రాన్ని పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్ తన చేతుల మీదుగా మంథనిలోని తన నివాస రాజగృహ లో మంగళవారం బాధితురాలికి అందజేశారు.