ఎవరి మనోభావాలను నొప్పించలేదు: రవి

న్యూఢిల్లీ: తాను ఎవరి మనోభావాలను నొప్పించలేదని కేంద్రమంత్రి వయలార్‌ రవి అన్నారు. బుధవారం తను విలేకరులతో మాట్లాడిన మాటలను సంచలనం చేయడం బధాకరమన్నారు. ఆంధ్రప్రదేశ్‌తో తనకు 1960 నుంచి అనుబంధం కొనసాగుతోందని రాష్ట్రంలోని ఏప్రాంతానికి చెందిన ఎవరి మనోభావాలను కించపరిచే ఉద్దేశం లేదని ఆయన పేర్కొన్నారు.