ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు పై
ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు పై హుజురాబాద్ ఎసిపి వెంకట్ రెడ్డి విచారణ.వీణవంక ఏప్రిల్ 1 (జనం సాక్షి) వీణవంక మండలంలోని చల్లూరు గ్రామానికి చెందిన ఎలుక పెళ్లి నగేష్ వార్డ్ సభ్యుని చల్లూరు గ్రామ పంచాయతీ కార్యదర్శి మల్లికార్జున్ వార్డ్ మెంబర్ ను దూషించడంపై ఇటీవల కేసు నమోదు చెయ్యగా శనివారం హుజరాబాద్ ఏసిపి వెంకట్ రెడ్డి చల్లూరు గ్రామంలో విచారణ చేపట్టారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పై సాక్షులను విచారించి నివేదిక ఉన్నతాధికారులకు పంపిస్తున్నట్లు హుజరాబాద్ ఏసిపి వెంకటరెడ్డి తెలిపారు. వారి వెంట జమ్మికుంట రూరల్ సిఐ సురేష్, వీణవంక ఎస్సై శేఖర్ రెడ్డి, స్థానిక సర్పంచ్ పొదిల జ్యోతి రమేష్ ఎంపిటిసి సవిత మల్లయ్య తోపాటు వార్డ్ సభ్యులు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.