ఎస్సైపై చేయిచేసుకున్న మహిళ

హైదరాబాద్‌: ఓ మహిళ ట్రాఫిక్‌ ఎస్సైపై చేయిచేసుకున్న సంఘటన అమీర్‌పేటలో చోటుచేసుకుంది. నోపార్కింగ్‌ ప్రాంతంలో కారు నిలిపినందుకు దివ్య అనే మహిళకు ట్రాఫిక్‌ ఎస్సై రాజగోపాల్‌ 200రూపాయల చలానా రాశాడు. దీంతో ఆగ్రహించిన దివ్య ఎస్సైపై చేయిచేసుకుంది. విధుల్లో ఉన్న పోలిస్‌ అధికారిపై చేయిచేసుకోవటంతో దివ్యను అరెస్ట్‌ చేసిన పోలీసులు పంజాగుట్ట స్టేషన్‌కు తరలించారు.