ఏకీకృత ఫీజు విధానాన్ని అమలుచేయాలని సుప్రీం ఆదేశం

ఢిల్లీ: వృత్తి విద్యాకళాశాలల్లో ఏబీ కేటగిరిపై  స్పష్టత ఇవ్వాలన్న ప్రభుత్వ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. కొత్త బ్యాచ్‌లకు ఏకీకృత ఫీజు విధానాన్ని అమలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మే 9న ఈ కోర్టు ఇచ్చిన తీర్పును యధాతధంగా అమలుచేయాలని ఆదేశించింది. సెప్టెంబరు 25న విచారణలో ప్రధాన పిటిషన్‌ సుప్రీంకోర్టు కూలంకషంగా వాదనలు విననుంది.