ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు ధర్నా ఉద్రిక్తతం

హైదరాబాద్‌: విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలంటూ ఏబీసీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు చేపట్టిన ధర్నా ఉద్రిక్తతకు దారితీసంది. పెద్దసంఖ్యలో చేరుకున్న విద్యార్థులు ఒక్కసారిగా ప్రవేశద్వారాలు ఎక్కిలోనికి చొచ్చుకెళ్లేంకు ప్రయత్నించారు. రాష్ట్రంలో విద్యార్ధులు ఎదర్కొంటున్న వివిధ సమస్యల పరిష్కారం కోసం లక్డీకపూల్‌లోని విద్యాశాఖ కమిషన్‌ కార్యలయాన్ని ముట్టడించేందుకు యత్నించారు. పోలీసులు ఆందోళనకారులను అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థు నాయకులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పుస్తకాల పంపిణీలో జాప్యం, విద్యాహక్కు చట్టం అమలు, పాగశాలల్లో కనీస సౌకర్యాల కొరత తదితర సమస్యలపై ఏబీవీపీ ఈ ధర్నా చేపట్టింది.