ఏసీబీ సోదాల్లో రూ. 70 లక్షల అక్రమార్జన గుర్తింపు

శ్రీకాకుళం : పలాస విద్యుత్‌ శాఖ ఏడీగా పనిచేసిన మధుసూదన్‌రావు ఇళ్లపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. హైదరాబాద్‌ , విశాఖ, సంతకవిటి ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు చేపట్టారు. ఈ సోదాల్లో రూ. 70 లక్షల అక్రమార్జనను అధికారులు గుర్తించినట్లు సమాచారం. రెండు నెలల కిందట ఓ జీడిపప్పు వ్యాపారి నుంచి రూ. 2వేలు లంచం తీసుకుంటూ మధుసూదన్‌రావు ఏసీబీ అధికారులకు చిక్కారు.