ఏ వ్యాపారంచేసి ఆస్తులు సంపాదించారు?

న్యూఢిల్లీ:వైఎస్‌ కుటుంబం ఏ వ్యాపారం చేసి ఇన్ని ఆస్తులు సంపాదించారో సీబీఐకి చెప్పాలని కాంగ్రెస్‌ ఎంపీ హర్షకుమార్‌ డిమాండ్‌చేశారు.వైఎస్‌ ముఖ్యమంత్రి పదవికాక ముందు ఆస్తుల విలువెంత చెప్పాలని ఆయన కోరారు.వైఎస్‌ బతికివుంటే ఆయన చేసిన కుంభకోణాలకు ముఖ్యమంత్రి పదవి పోయేదని అన్నారు.ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే సీబీఐ జేడీ,కాంగ్రెస్‌పై విజయమ్మ ఆరోపణలు చేస్తున్నారని ఆయనన్నారు.ఆదర్శ్‌ కుంభకోణంలో ఇరుకున్న సీఎంను కాంగ్రెస్‌ వెంటనే తొలగించిదని హర్షకుమార్‌ వెల్లడించారు.

తాజావార్తలు