ఐఐటీల స్వయం ప్రతిపత్తిని గౌరవించాలి

ఢిల్లీ:  దేశమంతా ఒకే పరీక్ష అంటూ మానవ అభివృధ్ధి శాఖ ప్రతిపాదించిన ఐఐటీ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్టుకు సర్వత్రా నిరసన వెల్లుత్తుతున్న సంగతి తెలిసిందే. ఈ  నేపధ్యంలో ఐఐటీల  ఆల్‌ ఇండియా ఫ్యాకల్లీ ఫెడరేషన్‌ ఈ రోజు ప్రధాని మన్మోహన్‌ని కలిసి వినతిపత్రం అందజేసింది. ఐఐటీల  స్వయంప్రతిపత్తిని కాపాడాలని, మంత్రిత్వ శాఖ తెచ్చిన కొత్త ప్రతిపాదనను అంగీకరించడం, అంగీకరించకపోవడం ఐఐటీల ఇష్టానికే వదిలేయాలని ఏఐఎఫ్‌ఎఫ్‌ తమ వినతిపత్రంలో పేర్కొంది. ఐఐటీల స్వయంప్రతిపత్తిని గౌరవిస్తామని ప్రధాని వారికి హామి ఇచ్చారు. హెచ్‌ఆర్‌డీ పేర్కొన్న కారణాలన్నిటినీ  ఫ్యాకల్లి ఫెడరేషన్‌ కొట్టివేసింది. ఏ కొత్త ప్రతిపాదన ఆయినా 2014 నుంచీఅమల్లోకి వచ్చేలా చూడాలని 2013 నుంచీ వద్దని ఏఐఎఫ్‌ఎఫ్‌ తెలిపింది.