ఓకే నియోజకవర్గానికి 11 వేల డబుల్ బెడ్రూం ఇండ్లను మంజూరు చేసిన దమ్మున్న ముఖ్యమంత్రి కెసిఆర్. శాసన సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి.

 

 

 

 

కోటగిరి మార్చి 16 జనం సాక్షి:-భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి ఏ ఒక్క నియోజక వర్గానికి మంజూరు చేయని,11 వేల డబుల్ బెడ్రూం ఇళ్లను సీఎం కేసీఆర్ బాన్సువాడ నియోజకవర్గానికి మంజూరు చేశారని తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి కొనియాడారు.గురువారం మండల కేంద్రంలోని మార్కెట్ కమిటీ ఆవరణంలో ఉమ్మడి కోటగిరి మండలంలోని 13 గ్రామాలకు చెందిన రెండు పడకల ఇండ్ల లబ్ధిదారులకు స్పీకర్ చేతుల మీదుగా సుమారు రూ.4.5 కోట్ల బిల్లులను ఆన్లైన్,నగదు, చెక్కుల రూపంలో పంపిణీ చేశారు.ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ సహకారంతో బాన్సువాడ నియోజక వర్గానికి 11 వేల డబుల్ బెడ్రూం ఇండ్లను మంజూరు చేసుకోవడం జరిగింద న్నారు.మరోమారు సీఎం కేసీఆర్ సహకారంతో సుమారు 4000 ఇండ్లు బాన్సువాడ నియోజక వర్గానికి మంజూరు కానున్నాయని తెలిపారు.సొంత స్థలం ఉన్న వారికి త్వరలో 3 లక్షల పథకం ద్వారా సింగిల్ బెడ్ రూమ్ నిర్మించుకునే పథకం ప్రారంభం కాబోతుందన్నారు.ఈ పథకం ద్వారా లబ్ధిదారులకు మూడు విడుదలలో నేరుగా వారి ఖాతాలలో నగదు జమవుతుందన్నారు.రైతుల కోరిక మేరకు మరో మారు విడతగా నిజాంసాగర్ నీటిని సరఫరా చేస్తామ న్నారు.స్థానిక ప్రజా ప్రతినిధులు యాసంగి వరి కొనుగోలు కేంద్రాలను సిద్ధం చేయాలని సూచించారు. మద్నూర్ నుండి వయా పోతంగల్,కోటగిరి,రుద్రూర్ బోధన్ వరకు నేషనల్ హైవే మంజూరు కావడం, త్వరలో ఈ హైవే నిర్మాణ పనులు కూడా ప్రారంభిం చుకోవడం జరుగుతుందన్నారు.అనంతరం ఉమ్మడి కోటగిరి మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన గ్రామ సమన్వయ కమిటీ సభ్యులతో స్పీకర్ ప్రత్యేక సమావేశం నిర్వహించి ఇప్పటి వరకు ఉమ్మడి మండలానికి మంజూరైన నిధులపై జరుగుతున్న అభివృద్ధి పనుల విషయాలు,త్వరలో ప్రారంభమ య్యే సింగల్ బెడ్రూం విధివిధానాలు,జీప్లస్ టు ఇండ్ల నిర్మాణం గూర్చి కమిటీ సభ్యుతో స్పీకర్ చర్చించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ శంకర్ పటేల్,హౌసింగ్ డీ.ఈ నాగేశ్వర్ రావు,జిల్లా,మండల కో ఆప్షన్ సభ్యులు సీరాజుద్దిన్,ఇస్మాయిల్, మార్కెట్ కమిటీ చైర్మన్ హమీద్,సర్పంచ్ ఫోరం మండల కన్వీనర్ పత్తి లక్ష్మణ్,మండల బిఅర్ ఎస్ పార్టీ అధ్యక్షులు ఎజాజ్ ఖాన్, మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు కొల్లూరు కిషోర్,స్థానిక ప్రజా ప్రతినిదులు,అధికారులు,సీనియ ర్ నాయకులు,రెండు పడకల ఇండ్ల లబ్ధిదారులు, తదితరులు పాల్గొన్నారు.