ఓయూ విద్యార్థుల జోలికెళితే పతనమే: మందకృష్ణ
హైదరాబాద్:ఓయూ విద్యార్థుల జోలికెళితే కేసీఆర్ పతనం మొదలైనట్లేనని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ హెచ్చరించారు. ఓయూ భూములు తాకొద్దని, పేదలకు ఇళ్లు నిర్మించి ఇవ్వాలనుకుంటే కేబీఆర్ పార్క్, గోల్ఫ్ కోర్సు భూములను కేటాయించాలని సూచించారు. ఓయూ భూముల వ్యవహారంలో అరెస్టయిన విద్యార్థులను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.



