కంటి వెలుగును సద్వినియోగం చేసుకోవాలి
కమాన్ పూర్ , జనం సాక్షి : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా మంగళవారం సిద్ధిపల్లె గ్రామపంచాయతీలో కంటివెలుగు కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా హాజరైన కమాన్ పూర్ ఎంపీపీ రాచకొండ లక్ష్మీ స్థానిక సర్పంచ్ తాటికొండ శంకర్, ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రంలోని పేదప్రజల సంక్షేమం కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలుచేస్తున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రతిష్టాత్మకంగా తెలంగాణ రాష్ట్రంలోని పేదప్రజల కంటి పరీక్షల కోసం కంటి వెలుగు అనే కార్యక్రమాన్ని అమలుచేసి కంటి పరీక్షలను పూర్తిగా ఉచితంగా చేస్తున్నారని అన్నారు. పేద ప్రజలు అందరూ కంటి వెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కమాన్ పూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ దాసరి రాయలింగు, కమాన్ పూర్ ఎంపిటిసి-2 బోనాల వెంకటస్వామి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గుర్రం లక్ష్మీమల్లు, ఉప సర్పంచ్ జాబు సతీశ్, ఎంపీడీఓ విజయ్ కుమార్, వైద్యాధికారి డా. షణ్ముఖ ప్రియా, గ్రామపంచాయతీ కార్యదర్శి వికాస్, వార్డ్ సభ్యులు మాటేటి కుమార్,కందుల రవి, మాటేటి స్వరూప, సిద్ధిపల్లె బీఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు కుందారపు సత్యం, నాయకులు రాచకొండ రవి, బంగారు గట్టయ్య, మాటేటి వెంకటేశం, నారాయణ లతో పాటు వైద్యాధికారులు, తదితరులు పాల్గొన్నారు.